Posts

Showing posts from July, 2022

అట్టహాసంగా జరిగిన బాపట్ల జిల్లా తొలి AITUC మహా సభ.

Image
చీరాల పట్టణంలో కార్మికుల భారీ ర్యాలీ. ఈ కార్యక్రమానికి బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా గౌరవ అధ్యక్షులుగా మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో కామాక్షి హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు, డాక్టర్ జీవి పున్నారావు, మారుబోయిన పాపారావు,సీపీఐ బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి,తన్నీరు సింగరకొండ,సీపీఐ జిల్లా సమితి సభ్యులు మేడ వెంకట్రావు, ఏఐటీయూసీ బాపట్ల జిల్లా కన్వీనర్ బత్తుల శామ్యూల్, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు పి నాగంజానేయులు, కోటి దాసు,ధనలక్ష్మి, జెల్లీ భాగ్య శ్రీధర్,అచ్యుతుని బాబురావు, ప్రసాద్, అంజిరెడ్డి, కరిముల్లా, పడమట భిక్షాలు, బాసి పైడయ్య,తదితరులు పాల్గొన్నారు.

విషాదం: బాసర ఐఐఐటీ విద్యార్థి మృతి, కలుషిత ఆహారమే కారణం!

Image
హైదరాబాద్: బాసర ఐఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థి మృతి చెందాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్ రంగెంపేటకు చెందిన సంజయ్ కిరణ్ (22) బాసర ఐఐఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విషతూల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు సంజయ్​. దీంతో కొంతకాలంగా హనుమకొండ రోహిణి, హైదరాబాద్‌​లోని యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. వైద్యానికి దాదాపు 16 లక్షలు ఖర్చుచేసినా లాభం లేకపోయింది. ఐఐటీలో ఆహారం విషతుల్యం కావటం వల్లే.. తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని సంజయ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా తన కుమారున్ని కాపాడుకోలేకపోయామని సంజయ్ తండ్రి శ్రీధర్ గుండెలవిసేలా రోధించాడు. అయితే బాసర ట్రిపుల్​ఐటీలో చేరక ముందే సంజయ్ అనారోగ్యం బారిన పడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో సంజయ్ కిరణ్ మృతిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో జులై 15న మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ కలుషిత

చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య108 జయంతి వేడుకలు.

Image
బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ముద్రబోయిన మాలకొండయ్య ఆధ్వర్యంలో మాజీమంత్రి,ప్రజాబంధు ప్రగడ కోటయ్య నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,1952 వ సంవత్సరం లో జన్మించిన ప్రగడ కోటయ్య నాటి నేటి నేతలకు ఆదర్శప్రాయులు.చేనేతల అభివృద్ధికి విశేష కృషిచేసిన మహోన్నత వ్యక్తి.అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌతరపు జనార్దన్,శ్రీనివాస తేజ,పూర్ణ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

Image
బాపట్ల జిల్లా చీరాలలో మాజీమంత్రి, ప్రజాబంధు ప్రగడ కోటయ్య నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరి కూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు,దామర్ల శ్రీకృష్ణ,చుండూరు వాసు తదితరులు. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరికూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,చుండూరి వాసులు మాట్లాడుతూ, ప్రజాబంధు ప్రగడ కోటయ్యను రగడ కోటయ్యగా కూడా పిలుస్తుంటారు.ప్రజా సమస్యల పట్ల బాగా స్పందిస్తారు.రెండు సార్లు ఎం ఎల్ ఏ గా,ఒకసారి ఎం ఎల్ సి గా ఎన్నికైనారు.చేనేత రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన గొప్పవ్యక్తి ఆయన.అంతేకాదు ఎత్తిపోతల పథకానికి సైతం ఆయన శ్రీకారం చుట్టారు ఆయన నూట ఎనిమిదవ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగడ కోటయ్య కుమారులు రిటైర్డ్ ఇంజినీర్ ప్రగడ వెంకట శేష సాయి నాధ్ దంపతులు,పలువురు కౌన్సిల్లెర్లు,అ

పాఠశాలలో బాలిక కాలును చుట్టేసిన పాము.. ఆ తర్వాత ఏమైందంటే!!

Image
పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో భయానక ఘటన జరిగింది. ఓ నాలుగో తరగతి విద్యార్థిని కాలును పాము చుట్టేసింది. ఆ బాలిక గట్టిగా అరుస్తూ..కాలును విదిలించడంతో పాము విడిచిపెట్టింది. అనంతరం అల్మరాలో దూరింది. ఈ ఘటన పాలక్కాడ్‌లోని ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో జరిగింది. బాలిక కేకలు విన్న ఉపాధ్యాయులు పరుగున తరగతి గదికి చేరుకున్నారు. ఆ పామును గుర్తించి, చంపేశారు. షాక్‌కు గురైన బాలికను జిల్లా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆ బాలికను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె కాలిపై పాముకాటు గుర్తులు లేవని, 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. భారీ వర్షం కారణంగా పాఠశాల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరిగాయని, విషపురుగులు తరగతి గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.

27న చేపట్టే అగ్రిగోల్డ్ సదస్సును జయప్రదం చేయాలి- CPI నాయకులు.

Image
కోసిగి మండల: ఈ నెల 27న చేపట్టే అగ్రిగోల్డ్ సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎమ్. గోపాల్ సిపిఐ మండల కార్యదర్శి తాయన్న మాట్లాడుతూ ఈ నెల 27న బుధవారం ఉదయం 10 గంటలకు సి.అర్. భవన్ సి.పి.ఐ ఆఫీసు నందు, వినాయక ఘాట్ దగ్గర, కొత్త అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంనకు రాష్ట్ర సమితి నాయకులు కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వర రావు హాజరవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన చెల్లింపుల విషయంలో వస్తున్న సమస్యలపై 20 వేల పైన రావలిసిన డిపాజిట్ల గురించి, బౌన్స్ అయిన చెక్స్ గురించి, చనిపోయిన బాధితులు ఎక్స్ గ్రేసియా విషయం పై, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్ గురించి మరియు కోర్టులో కేసు వేగవంతం పై జరగవలిసిన చర్యలు గురించి తదితర విషయాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ తప్పక రావలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శిఉలిగయ్య, దిద్ది సిద్దప్ప, ఈరన్న, నాగరాజు, వీరేష్,

కాంగ్రెస్‌కు ‘మునుగోడు’ టెన్షన్.. మళ్లీ అలా జరిగితే.. కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమా ?

Image
తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఆ ఎన్నికలతో నష్టపోతోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అనేక మంది విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, నాగార్జునసాగర్,(Nagarjuna Sagar) హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. నాగార్జునసాగర్‌లో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచినా.. అదంతా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ వల్లే అనే వాదన ఉంది. ఈ ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని.. ఆ స్థానంలో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ బలపడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇదిలా ఉంటే త్వరలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు(Munugodu) స్థానానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వస్తుందనే వాదన వినిపిస్తోంది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై టీఆర్ఎస్, బీజేపీ ఇప్పట

చేనేతల_రౌండ్_టేబుల్_సమావేశం

Image
చీరాల గోలి సదాశివరావు కల్యాణ మండపంలో చేనేతల రౌండ్ టేబుల్ సమావేశం దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర అధ్యక్షతన  చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ  ప్రారంభ ఉపన్యాసం తో సమావేశం ప్రారంభించి నాయకులు ప్రస్తుత పరిస్థితులు మరియు చేనేత పురోభివృద్ధి కి కావలసిన సూచనలు  ఇవ్వాలని కోరారు. మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా ఉత్పత్తికి అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేయాలని కోరారు. దామర్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేత చీరలను పవర్ లూము పై తయారు చేయకుండా చేనేత రిజర్వేషన్ యాక్ట్ ని అమలు చేయాలని కోరారు. కర్ణ లక్షరావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం చేనేతలకు ఎంతో ఉపయోగపడుతుందని  అలాగే సొసైటీలో నిల్వ ఉన్న వస్త్రాలు కొనుగోలు చేసి సొసైటీ లను బలోపేతం చేయాలని కోరారు. పింజల ప్రసాదరావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం చేనేతలు ఉన్న నియోజకవర్గంలో చేనేతలకు ప్రజా ప్రతినిధులు గా ఉంటే మన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అందుకే మనం కలసి కట్టుగా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. గంజి ప్రసాదరావు మాట్లాడుతూ నూలు పై వేసిన జి ఎస్

10వ వార్డులో వాలెంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన కౌన్సిలర్ గోలి స్వాతి ......

Image
10వ వార్డులో వాలెంటీర్లకు  నియామక పత్రాలు అందజేసిన కౌన్సిలర్ గోలి స్వాతి ...... గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు   అత్యంత  పటిష్టమైన వాలంటీర్స్ వ్యవస్థ అనేది ఏపీ ప్రభుత్వపు అతిముఖ్యమైన కార్యక్రమమని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వాలంటీర్ల పనని,ఈ వ్యవస్థ ద్వారా ప్రజలందరు సులభంగా ప్రభుత్వ సర్వీసులు పొందడం వీలవుతుందని,మహాత్మా గాంధీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను వైసీపీ ప్రభుత్వం నిజం చేసిందని కౌన్సిలర్ గోలి స్వాతి అన్నారు . చీరాల  శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కరణం బలరాం కృష్ణమూర్తి గారి సహకారంతో చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్  గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జ. శ్రీనివాసరావు గారి గోలి రవికుమార్  అధ్యక్షతన గోలి  స్వాతి చేతుల మీదుగా వాలంటీర్ కి జాయినింగ్ రిపోర్ట్ అందించారు.

కామాక్షి కేర్ హస్పిటల్ లో డయాలసిస్,సెంటర్ అధునాతన కిడ్ని లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ ను ప్రారంభించిన వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి తదితరులు...

Image
బాపట్ల జిల్లా చీరాల కామాక్షి కేర్ హస్పిటల్ లో డయాలసిస్,సెంటర్ అధునాతన కిడ్ని లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ ను వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ కిడ్ని సంబంధిత వ్యాధులతో దూరం ప్రాంతలకు వేళ్ళి వైద్యపరిక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండేందుకు బాపట్ల జిల్లాలోనే తొలి డయాలసీస్ యూనిట్ ను కామాక్షి కేర్ హస్పిటల్ ఎం.డి తాడివలస దేవరాజు ఏర్పాటు చేయడం ఏంతో శుభపరిణమని ,దింతో పాటు కిడ్నిలో రాళ్ళతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు లైజర్ ట్రీట్మెంట్ ద్వారా  గంట వ్యవధిలో కిడ్నిలో రాళ్ళను తొలగించే పరికరాలను ఏర్పాటు చేయడం ఏంతో అభినందనీయమని కొనియడారు.ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి డా"వరికూటి అమృతపాణి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గోన్నారు.

ఐక్యనగర్ లో ఉన్న కారంచేడు మృతవీరుల రుధిరక్షేత్రం వద్ద ఘన నివాళి

Image
బాపట్ల జిల్లా చీరాల ముప్పై మూడవ వార్డు ఐక్యనగర్ లో ఉన్న కారంచేడు మృతవీరుల రుధిరక్షేత్రం వద్ద దుడ్డు భాస్కరరావు,లక్ష్మీనరసయ్య,గొర్రెపాటి రవి,బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి,పట్టణాధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి,భగత్ సింగ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుడ్డు భాస్కరరావు మాట్లాడుతూ, కారంచేడు సంఘటన జరిగి నేటికి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది.ఆ సంఘాటనలో ఏడుగురు అసువులు బాసారు.ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు.జిల్లా కోర్టు నుండి హైకోర్టు లో కూడా మాకు అన్యాయం జరిగింది.తదుపరి సుప్రీంకోర్టులో ఇరవై సంవత్సరాలు పోరాడితే  మాకు న్యాయం జరిగింది.ఈపోరాటంలో మాకు అనేకమంది నాయకులు అండగా నిలిచారు.వారి దయవల్ల ఆ దారుణ మారణ కాండలో పాల్గొన్న వారికి శిక్షలు పడ్డాయి అని తెలిపారు.

కారంచేడు దాడికి 37 ఏళ్లు

Image
కారంచేడు స్మారక స్థూపం కారంచేడు మారణకాండకు నేటితో 37 ఏళ్లు. రాజకీయంగా, సామాజికంగా కులం పోషిస్తున్న పాత్రను, ముఖ్యంగా దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన ఘటన కారంచేడు. హరిత విప్లవం సాగిన ప్రాంతాల్లో దాని వల్ల బలపడిన శూద్ర అగ్రకులాలు దళితుల మీద సాగించిన దాడిగా దీనికి సామాజిక క్రమంలో ప్రాధాన్యముందని విశ్లేషకులు భావిస్తారు. తెలుగు నేల మీద జరిగిన ప్రధాన దాడులు కారంచేడు, చుండూరు.. రెంటిలోనూ పారిన నెత్తుటికి నీటి పారుదల కాల్వలు సాక్ష్యంగా ఉండడం సామాజిక పరిణామంలో కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ విషయంలో అంతగా చర్చలో ఉండని రాజకీయ నాయకుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు గత ఏడాది హఠాత్తుగా నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో మరొక్కమారు అది చర్చకు వేదికగా మారింది. ఈ నేపథ్యంలో బీబీసీ తెలుగు కారంచేడు ఘటనతో ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తులతో 2020 సంవత్సరంలో మాట్లాడింది. "తగలబెట్టేద్దామని అనుకున్నారు" "మాదిగల మీద కోపంగా ఉన్న కమ్మవారు పొద్దున్నే పల్లెమీదకు వస్తారని తెలుసు. వాళ్లొస్తే లేని పోని రచ్చ. మీరు కాలువకు పొండి అని మా అమ్మ నన్

చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.సరోజినీ మీడియా సమావేశం

Image
బాపట్ల జిల్లా: చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.సరోజినీ మీడియా సమావేశం  రేషన్,ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవు రేషన్ అక్రమ రవాణా కు పాల్పడిన  ఆరుగురు  మీద కేసులు నమోదు చేశాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్దలాలను ప్రభుత్వం కేటాయించింది నివాస స్దలం కోసం సచివాలయంలో అర్జిలు పేట్టుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జిలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారిస్తాం. ఈ కార్యక్రమంలో చీరాల మండల తహశీల్దార్ జె. ప్రభాకరరావు పాల్గొన్నారు.

TDP సభ్యత్వ నమోదు పూరోగతి , ఓటర్ పరిశీలన, క్లస్టర్ గురించి చర్చలు.

Image
చీరాల నియోజకవర్గ విస్తృత స్థాయి క్లిష్టర్స్, యూనిట్స్ సమావేశం పార్టీ  కార్యాలయంలో జరిగినది. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి యం.యం.కొండయ్య గారు అధ్యక్షతన సభ్యత్వ నమోదు పూరోగతి , ఓటర్ పరిశీలన, క్లస్టర్ గురించి చర్చించారు   ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా  రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు పమిడి  భాస్కరరావు గారు, నాయకులు జిల్లా బి.సి సెల్ అధ్యక్షులు కౌతారపు జనార్దన్, చీరాల మాండల అధ్యక్షులు గంజి పురుషోత్తం ,సీనియర్ నాయకులు కురపాటి పూర్ణ, ఐటీడీపీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ బిట్రా చైతన్య కుమార్,పులి వెంకట్రావు మొదలగు నాయకులు పాల్గొన్నారు.

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలి -- బీరక సురేంద్ర చైర్మన్ దేవాంగ కార్పోరేషన్.

Image
అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలి -- బీరక సురేంద్ర చైర్మన్ దేవాంగ కార్పోరేషన్ వేటపాలెం మండలంలోని అక్కాయిపాలెం పంచాయితీ పరిధిలోని మాచర్ల మోహన్ రావు కాలనీ మరియు గురవయ్య కాలనీ లో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పర్యటించి చేనేతలతో మాట్లాడటం జరిగింది.నేతన్న నేస్తం నమోదు ప్రక్రియ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంటనే సచివాలయ సిబ్బంది తో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్క నేతన్నకు నేతన్న హస్తం అందేలా చూడాలని సూచించారు.సురేంద్ర మాట్లాడుతూ  అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటం ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష్యం కనుక వారి లక్ష్య సాధన కోసం ప్రభుత్వసంక్షేమ పధకాలన్నీ సక్రమంగా అందరికీ అందేలా చూడటమే మా భాద్యత.  అర్హులై ఉండి, ఎవరికైనా పొరపాటున నేతన్న హస్తం కానీ సంక్షేమ పథకాలు రాని పక్షంలో మాదృష్టికి తీసుకొచ్చిన యెడల సంబంధిత అధికారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు మంజూరు చేసేలా తమవంతు కృషిచేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్ర వెంకటేశ

వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన కౌన్సిలర్ స్వాతి...

Image
10 వార్డులోని కొత్తగా వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన కౌన్సిలర్ స్వాతి  వాలంటీర్స్ సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వపు అతిముఖ్యమైన కార్యక్రమమని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వాలంటీర్ల పనిని,ఈ వ్యవస్థ ద్వారా ప్రజలందరు సులభంగా ప్రభుత్వ సర్వీసులు పొందడం వీలవుతుందని,మహాత్మా గాంధీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను వైసీపీ ప్రభుత్వం నిజం చేసిందని వైస్సార్సీపీ 10 వార్డు  మున్సిపల్ కౌన్సిలర్ గోలి స్వాతి  అన్నారు. శుక్రవారం మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్ మల్లేశ్వరరావు చేతుల మీదుగా వాలంటీర్ కి జాయినింగ్ ఆర్డర్స్  అందించారు.

చైర్మన్ జంజనం చేతుల మీదుగా వాలేంటర్ కు నియామక పత్రం అందుచేత.....విధులు సక్రమంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి.......

Image
బాపట్ల జిల్లా, చీరాల... నిత్యం వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందే విధంగా చూస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు లకు మంచి పేరు తీసికొనివచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.చీరాల పట్టణ పరిధిలోని పేరాల శృంగార పేటకు చెందిన పేర్లి నవీన్ 21 వార్డులో వాలేంటర్ గానియమితులయ్యారు,నవీన్ కు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వర రావు మరియు వైసీపీ నాయకులు  పేర్లి నాని చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందచేశారు.ఈ సందర్భంగా జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందే విధంగా కృషి చేయాలని, మంచి పేరు తెచ్చుకొని ఉత్తమ వాలేంటర్ గా అవార్డు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్  నాగమల్లేశ్వర రావు,వైసీపీ నాయకులు పేర్లి నాని,ప్రకాష్, నూతన వాలేంటర్ గా నియమితులైన నవీన్  పాల్గొన్నారు.