పాఠశాలలో బాలిక కాలును చుట్టేసిన పాము.. ఆ తర్వాత ఏమైందంటే!!

పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో భయానక ఘటన జరిగింది. ఓ నాలుగో తరగతి విద్యార్థిని కాలును పాము చుట్టేసింది. ఆ బాలిక గట్టిగా అరుస్తూ..కాలును విదిలించడంతో పాము విడిచిపెట్టింది.
అనంతరం అల్మరాలో దూరింది. ఈ ఘటన పాలక్కాడ్‌లోని ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో జరిగింది.
బాలిక కేకలు విన్న ఉపాధ్యాయులు పరుగున తరగతి గదికి చేరుకున్నారు. ఆ పామును గుర్తించి, చంపేశారు. షాక్‌కు గురైన బాలికను జిల్లా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆ బాలికను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె కాలిపై పాముకాటు గుర్తులు లేవని, 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. భారీ వర్షం కారణంగా పాఠశాల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరిగాయని, విషపురుగులు తరగతి గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....