జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....

చిద్విలాసంగా జ్ఞాపికను స్వీకరించిన జిల్లా కలెక్టర్ .......

చీరాల, బాపట్ల జిల్లా...

సేవా తత్వానికి నిదర్శనం మధర్ థెరిసా అని, ఎదుటివారి ఎడల ప్రేమ,జాలి,దయ,కరుణ కలిగినప్రేమస్వరూపిణి,పేదలను అక్కున చేర్చుకొని అమ్మలా లాలించిన సేవా సాద్విని మధర్ థెరిసా 112 వ జయంతి ని పురస్కరించుకుని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా సంయుక్త కార్యదర్శి పేర్లి నాని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కు బాపట్ల కలక్టరేట్ లో మధర్ థెరిసా జ్ఞాపికను అందచేశారు. ఈ జ్ఞాపికలో ప్రత్యేకత ఏమిటంటే జిల్లా కలెక్టర్ ఫోటో,జిల్లా కలెక్టర్ సంక్షేమ హాస్టల్ విద్యార్థినిలతో కూర్చుని చిరునవ్వుతో ముచ్చటిస్తూ వారితో కలిసి సహపంక్తి భోజనం అరగించిన చిత్రాన్ని కూడా ఈ జ్ఞాపికలో పొందుపరచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పేర్లి నాని అందచేసిన చిత్రపటాన్ని చూసి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మధర్ థెరిసాను ఆదర్శంగా తీసుకుని పేదల ఎడల ప్రేమ,జాలి,దయ,కరుణ కలిగి ఉండాలని,ఎదుటివారి ఎడల గౌరవంగా,మర్యాదగా ఉండాలని, చేతనైన సహాయం చేయాలని తెలిపారు. అద్భుతమైన జ్ఞాపికను బహుకరించిన పేర్లి నానిని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందించారు.పేర్లి నాని మాట్లాడుతూ మానవతా, సేవా తత్వం తో మనందరికీ స్పూర్తినిచ్చినకరుణామూర్తి,తన జీవితాంతం కుష్టు రోగులకు, వికలాంగులకు,వృద్ధులకు,నిర్భాగ్యులకు సేవకై అంకితమైన మాతృమూర్తి మధర్ థెరిసా చిత్ర పటాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కు బహుకరించటం చాలా సంతోషంగా ఉందని, వారు కూడా జిల్లాలో ఉన్న ప్రజల పట్ల, సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్థిని, విద్యార్థుల పట్ల,పాఠశాల విద్యార్థుల పట్ల అంకితభావంతో ,చిరునవ్వుతో ముందుకు సాగుతూ ఉన్నారని, వారు నూతన జిల్లా కు మొదటి జిల్లా కలెక్టర్ గా రావడం మనకు అదృష్టం అని,వారు కూడా సేవా నిరతితో వారి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.చీరాల నియోజకవర్గ అభివృద్ధికిసహాయ,సహకారాన్ని అందచేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.