ముగిసిన మజ్జిగ చలివేంద్రం
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ దంపతులకు సన్మానం, వస్త్రాల పంపిణీ ఎన్‌ఆర్‌పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల గర్ల్స్ హైస్కూల్ వద్ద ఏప్రిల్ 26వ తేదీ నుండి ప్రారంభమైన ఉచిత మజ్జిగ చలివేంద్రం శనివారం 50వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శీరాం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మజ్జిగ పంపిణీలో ప్రతి రోజు క్రియాశీలంగా పాల్గొన్న దంపతులను, వాకింగ్ సభ్యులను సన్మానించారు. సేవాభావాన్ని గుర్తించగా, దంపతులకు నూతన వస్త్రాలు, స్వీట్ బాక్స్‌లు అందజేశారు. ఈ కార్యక్రమం కోసం మొత్తం రూ.1,50,000 ఖర్చు చేసినట్టు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, సభ్యులు చారగుళ్ళ గురుప్రసాద్, నారాయణమూర్తి, అమరా బుల్లిబాబు, కాటమరాజు, రమణారావు, బ్రహ్మానందం, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, ఏడుకొండలు, వీరాంజనేయులు, రఘు తదితరులు పాల్గొన్నారు.