మేదరమెట్లకు చేరుకున్న వైయస్‌ జగన్‌...వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్ధివ దేహానికి నివాళులు

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్‌ జగన్‌ బాపట్ల జిల్లా మేదరమెట్లలోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Comments

Popular posts from this blog

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు