Posts

Showing posts from February, 2025

రేపే AP కేబినెట్ భేటీ... బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం!

Image
• రేపు ఉదయం 9గంటలకు ఏపీ కేబినెట్ భేటీ... • బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్... • రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల... AP Cabinet: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగానే, రేపు (ఫిబ్రవరి 28న) ఉదయం 9 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలువుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనున్నారు. ఇక, కౌన్సిల్ లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.

యంగ్ సైంటిస్ట్ ఇండియా అనే సైన్సు మాస పత్రికను ఆవిష్కరించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య

Image
విద్యార్థులను ప్రోత్సహిస్తూ, నూతన ఆవిష్కరణల వైపు ఆలోచింపజేసే ఒక విజ్ఞాన సమాచార మాస పత్రిక చీరాల నుండి ప్రచురించడం ఎంతో అభినందనీయమని చీరాల శాసన సభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. యంగ్ సైంటిస్ట్ ఇండియా అనే సైన్సు మాస పత్రికను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ చీరాలలోని గీతా సంస్థ దేశ వ్యాప్తంగా హైస్కూలు విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. చీరాల నుంచి నిర్వహించే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో 22 రాష్ట్రాల నుండి 65,000 మంది విద్యార్థులు పాల్గొనడం ఆవిష్కార్ అవార్డుల ద్వారా ఇప్పటికే 23 ఆవిష్కరణలను రాబట్టడం అభినందనీయమన్నారు. రైలు ప్రయాణీకులు బండి కదిలేటప్పుడు ప్రమాదాలకు గురవకుండా పదవ తరగతి చదువుతున్న అక్షయ, సుప్రియలు సూచించిన సిగ్నల్ విధానం చాలా ఉపయోగకరం అన్నారు. మధ్యప్రదేశ్ విద్యార్థి ఆరుష్ తయారుచేసిన అగ్నినిరోధక పదార్థం ఎంతో ఆలోచనాత్మకంగా ఉందని.. స్కూలు విద్యార్థులయినా వారిలో ఎంతో ప్రతిభ దాగుంటుందని, దాన్ని వెలికి తీయడానికి ఈ యంగ్ సైంటిస్ట్ ఇండియా మాస పత్రిక జాత...

చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ లో రహదారి భద్రతపై అవగాహనా కార్యక్రమం.

Image
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాలలో రహదారి భద్రతపై అవగాహనా పౌర్యక్రమమును నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తముగా ఒక ప్రకటనలో తెలియజేశారు. రహదారి భద్రతపై అవగాహనా కార్యక్రమమును కళాశాల జాతీయ సేవా విభాగము వారి ఆధ్వర్యములో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. జగదీశ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా మహమ్మద్ మొయిన్, డి.యస్.పి. చీరాల విచ్చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ యం. వెంకటేశ్వర్లు, చీరాల సర్కిల్ ఇన్స్పెక్టర్, పి. శేషగిరిరావులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా|| కె. జగదీశ్ బాబు మాట్లాడుతూ రహదారి పై ప్రయాణించే ప్రతిఒక్కరు నియమ నిబంధనలను పాటించి తగు జాగ్రత్తలను పాటించి ప్రమాదాలను నివారించాలని అకాంక్షించారు. వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు రహదారిపై ప్రయాణించేటప్పుడు ముందు ప్రయాణించే వాహనాన్ని చేజింగ్ చేయడం మనాలని, రహదారి డివైడర్లు అనేకమంది మరణానికి కారణమవుతున్నాయని తెలిపారు. చీరా...

అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీలలో చీరాలకు చెందిన సాతుపాటి లక్ష్మి

Image
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీలలో చీరాలకు చెందిన సాతుపాటి లక్ష్మి సత్తా చూపి 63 కిలోల విభాగంలో బంగారు పతకం _సాధించింది. లక్ష్మీ 400 కిలోల బరువు మోసి అందరినీ అబ్బురపరిచింది.తద్వారా బంగారు పతకం అందుకొని కాశ్మీర్ లో మార్చిలో జరిగే ఆల్ ఇండియా యూనివర్సిటీల స్పోర్ట్స్ మీట్ కు ఎంపికైంది.లక్ష్మికి కోచ్ గా ఎన్. సుబ్రహ్మణ్యం వ్యవహరించారు.

మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కి లేఖలు

Image
పొరుగు సేవలు కార్మికుల కోసం గత వైసిపి ప్రభుత్వం కాలంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్‌ ను రద్దు చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గం సమావేశం తీర్మానించిన నేపథ్యంలో  ఆప్కాస్‌ లో ఉన్న  పొరుగు సేవల కార్మికులందరిలోనూ  తీవ్ర భయాందోళన నెలకొన్నరీత్యా ఆప్కాస్‌ ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుంది  ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిరది.  పొరుగు సేవల కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి ఉద్యోగ భద్రత,  భరోసా కల్పించే విధంగా కార్మికులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సోమవారం చీరాల మునిసిపల్ కార్మికులు ఏపి మునిసిపల్ వర్కర్స్& ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటీయు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి సామూహిక లేఖలు రాసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ఆప్కాస్‌ ను  రద్దుచేసి ఒప్పంద కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తుందని కార్మికులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని, అయితే  ఆవిధంగా  కాకుండా పాట దళారీ వ్యవస్థ ను తీసుకొచ్చే ఆలోచనలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం...

చీరాల టిడిపి కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక, పోటెత్తిన అర్జీదారులు.

Image
చీరాల నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌కు అర్జీదారులు భారీగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా పింఛన్ లు హౌసింగ్  నివాస స్థలాలు, రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే టిడిపి ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. స్వీకరించిన అన్ని అర్జీలను తొందరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రజా దర్బార్‌కు ప్రజలు విపరీతంగా స్పందించి, అధిక సంఖ్యలో అర్జీలు సమర్పించారు.

జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ బాడీ షేవింగ్ పోస్టులు పై ఫిర్యాదు

Image
జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై అవాంఛిత పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ అన్నారు.. శనివారం చీరాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీ ఐ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ  జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్లో అసభ్యంగా పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం హనానమయ్యేలా బాడి షేమింగ్ కు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాలవలస శ్రీనివాస్ ( ప్రోగ్రాం కమిటీ జిల్లా కార్యదర్శి ) మామిడాల శ్రీనివాసరావు,హనుమకొండ కిషోర్, గోకుల్ కిరణ్, కనపర్తి రామారావు, లక్కాకుల లక్ష్మి, టి కోటేశ్వరి, ఎం వీరమ్మ, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి, పాల్గొన్నారు.

వీరన్నపాలెంలో కనువిందు చేస్తున్న విదేశీ పక్షులు

Image
వీరన్నపాలెం గ్రామానికి విదేశీ పక్షులు చేరు కొని కనువిందు చేస్తున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో ఒక్కొక్కటిగా చేరుకున్న విదేశీ కొంగల సంఖ్య ఇప్పుడు పెద్దదిగా తయారైంది. గ్రామానికి ఉత్తరాన కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న స్థావరాన్ని పక్షులు తమ విడిదిగా చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం వేసవికాలం ప్రారంభంలో ప్రపంచానికి ఉత్తర భాగాన ఉన్న సైబీరియా దీవుల నుండి విదేశీ కొంగలు తమ ప్రాంతానికి వలస వస్తుంటాయని గ్రామస్థులు అంటునారు.

మోటారు దొంగలు అరెస్టు

Image
  పంట పొలాల్లో నీటి మోటార్లను దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు వద్ద నుండి లక్ష రూపాయిలు విలువ చేసే ఐదు మోటార్లను పోలీసులు స్వాదినం చేసుకున్నారు.చీరాల మండలం కావూరిపాలెం గ్రామంలోని పంట పొలాల్లో అదే గ్రామానికి చెందిన అక్కాల గోపిరెడ్డి, కావూరి గోపిరెడ్డి లు చెడు వ్యాసనాలకు బానిసలు అయ్యి వ్యవసాయ పొలాల్లోని నీటి మోటార్ల ను దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో నిందితులు నేరాన్ని ఒప్పుకోవడం జరిగిందని నిందితులను కోర్టులో హాజరుపరిచనున్నట్లుగా ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

చీరాల రైల్వే గేటు వద్ద వ్యక్తి అరెస్ట్

Image
చీరాల మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో, కారంచేడు రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తిని అదుపులోకీ తీసుకోని అతని వద్ద నుంచి 13 క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన

Image
నేరాల నియంత్రణలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చీరాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్ వంటి నేరాల భారిన పడకుండా ఉండేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. డీఎస్పీ మొహమ్మద్ మోయిన్, సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.