మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి కి లేఖలు

పొరుగు సేవలు కార్మికుల కోసం గత వైసిపి ప్రభుత్వం కాలంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్‌ ను రద్దు చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గం సమావేశం తీర్మానించిన నేపథ్యంలో  ఆప్కాస్‌ లో ఉన్న  పొరుగు సేవల కార్మికులందరిలోనూ  తీవ్ర భయాందోళన నెలకొన్నరీత్యా ఆప్కాస్‌ ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుంది  ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిరది.  పొరుగు సేవల కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి ఉద్యోగ భద్రత,  భరోసా కల్పించే విధంగా కార్మికులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సోమవారం చీరాల మునిసిపల్ కార్మికులు ఏపి మునిసిపల్ వర్కర్స్& ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటీయు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి సామూహిక లేఖలు రాసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ఆప్కాస్‌ ను  రద్దుచేసి ఒప్పంద కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తుందని కార్మికులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని, అయితే  ఆవిధంగా 
కాకుండా పాట దళారీ వ్యవస్థ ను తీసుకొచ్చే ఆలోచనలు చేయడం సరికాదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దు చేస్తే మున్సిపాలిటి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఐటీయూ  చీరాల కమిటీ నాయకులుబాపట్ల జిల్లా కన్వీనర్ చిమట వీరాస్వామి చీరాల కమిటీ  నాయకులు జీ. ఇమ్మానియెల్, డి.శామ్యూల్, క్రాంతిసాగర్, సింగయ్య,  షేక్ చాంద్ బాషా,గొల్లప్రోలు నాగేశ్వరరావు,పి. సురేష్, బి.రాబాబు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

చీరాల మోహన్ థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని విద్యార్థులకు ఉచిత ప్రదర్శన