కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు – 2025 కృష్ణా రెడ్డికి ప్రదానం

చీరాల, ఏప్రిల్ 2025: నిరంతరమైన నిబద్ధత, నిజాయితీ, ప్రజల పక్షాన గళమెత్తే ధైర్యంతో తన విలేఖరి వృత్తిని నడిపిస్తూ, సమాజంలో నిజాన్ని వెలుగులోకి తీసుకురావడంలో విశేష కృషి చేసిన సాక్షి టీవీ చీరాల విలేఖరి శ్రీ కృష్ణా రెడ్డి తాజాగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు  2025ను అందుకున్నారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం ప్రముఖ సేవా సంస్థ కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు హాజరయ్యారు.
 అవార్డు కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్రీమతి వి. వెంకట అశ్విని ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
* అవార్డు గ్రహీత కృషిపై ప్రశంసలు..
కృష్ణా రెడ్డి పలు సంవత్సరాలుగా తన వృత్తిపరమైన విలేఖరిత్వం ద్వారా సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుండారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా హక్కులు, విద్య, ఆరోగ్య సదుపాయాల కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఆయన రిపోర్టుల వలన అనేక ప్రభుత్వ అధికారుల దృష్టి సమస్యలపై పడింది, పరిష్కారాలు సాధ్యమయ్యాయి.
టీడీపి యువనేత గౌరీ అమర్నాథ్ మాట్లాడుతూ, "కృష్ణా రెడ్డి లాంటి జర్నలిస్టులు సమాజానికి మేల్కొలిపే గొంతులవుతారని. ఆయన లాంటి వారు ఇంకెందరో వెలుగులోకి రావాలి," అని అన్నారు.
ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, “ఈ గౌరవం నాకు మరింత బాధ్యతను కలిగిస్తోందని. జర్నలిజం నాకు వృత్తి మాత్రమే కాదు – ఇది సేవా మార్గం. ప్రజల కోసం, నిజం కోసం నేనెప్పుడూ నిలబడతానని అన్నారు.

సేవారత్న అవార్డు విశిష్టత
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు ప్రతి సంవత్సరం సామాజిక సేవ, విలక్షణ కృషి, ప్రజాసేవ వంటి రంగాల్లో విశేషంగా నిలిచిన వ్యక్తులకు అందజేయబడుతుంది. ఇది దేశవ్యాప్తంగా గౌరవప్రదమైన పురస్కారాలలో ఒకటని నిరంతరం ప్రజల గొంతుకై నిలబడతనని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృత పాణి, బేబి రాణి,తహసీల్దారు జీవిగుంట ప్రభాకర రావు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు