జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ బాడీ షేవింగ్ పోస్టులు పై ఫిర్యాదు

జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై అవాంఛిత పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ అన్నారు..
శనివారం చీరాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీ ఐ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు..
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ 
జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్లో అసభ్యంగా పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు..
సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం హనానమయ్యేలా బాడి షేమింగ్ కు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాలవలస శ్రీనివాస్ ( ప్రోగ్రాం కమిటీ జిల్లా కార్యదర్శి ) మామిడాల శ్రీనివాసరావు,హనుమకొండ కిషోర్, గోకుల్ కిరణ్, కనపర్తి రామారావు, లక్కాకుల లక్ష్మి, టి కోటేశ్వరి, ఎం వీరమ్మ, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి, పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

చీరాల మోహన్ థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని విద్యార్థులకు ఉచిత ప్రదర్శన