యంగ్ సైంటిస్ట్ ఇండియా అనే సైన్సు మాస పత్రికను ఆవిష్కరించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య

విద్యార్థులను ప్రోత్సహిస్తూ, నూతన ఆవిష్కరణల
వైపు ఆలోచింపజేసే ఒక విజ్ఞాన సమాచార మాస పత్రిక చీరాల నుండి ప్రచురించడం ఎంతో అభినందనీయమని చీరాల శాసన సభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. యంగ్ సైంటిస్ట్ ఇండియా అనే సైన్సు మాస పత్రికను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ చీరాలలోని గీతా సంస్థ దేశ వ్యాప్తంగా హైస్కూలు విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
చీరాల నుంచి నిర్వహించే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో 22 రాష్ట్రాల నుండి 65,000 మంది విద్యార్థులు పాల్గొనడం ఆవిష్కార్ అవార్డుల ద్వారా ఇప్పటికే 23 ఆవిష్కరణలను రాబట్టడం అభినందనీయమన్నారు. రైలు ప్రయాణీకులు బండి కదిలేటప్పుడు ప్రమాదాలకు గురవకుండా పదవ తరగతి చదువుతున్న అక్షయ, సుప్రియలు సూచించిన సిగ్నల్ విధానం చాలా ఉపయోగకరం అన్నారు. మధ్యప్రదేశ్ విద్యార్థి ఆరుష్ తయారుచేసిన అగ్నినిరోధక పదార్థం ఎంతో ఆలోచనాత్మకంగా ఉందని.. స్కూలు విద్యార్థులయినా వారిలో ఎంతో ప్రతిభ దాగుంటుందని, దాన్ని వెలికి తీయడానికి ఈ యంగ్ సైంటిస్ట్ ఇండియా మాస పత్రిక జాతీయ స్థాయిలో దోహదపడుతుందనీ మెచ్చుకున్నారు. గీతా సంస్థ ఛైర్మన్ వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇది ఒక ఒక మంచి కార్యక్రమం అంటూ ప్రోత్సహించి, పత్రికను ఆవిష్కరించినందుకు ఎమ్మెల్యే మాలకొండయ్యకి ధన్య వాదాలు తెలియజేశారు. ఈ పత్రిక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. ఈ పత్రిక గీతా డిజిటల్ మాధ్యమాల్లో YoungScientist.India.org అనే వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంటుందని ఆసక్తి ఉన్న వారు 9966775534 నంబరుకు ఫోనుచేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పత్రిక సంపాదకులు నందమూడి కృపా కిరణ్, చీమకుర్తి మధుసూదనరావు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

చీరాల మోహన్ థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని విద్యార్థులకు ఉచిత ప్రదర్శన