చీరాల టిడిపి కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక, పోటెత్తిన అర్జీదారులు.
చీరాల నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌కు అర్జీదారులు భారీగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రత్యేకంగా పింఛన్ లు హౌసింగ్ నివాస స్థలాలు, రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే టిడిపి ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు. స్వీకరించిన అన్ని అర్జీలను తొందరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ ప్రజా దర్బార్‌కు ప్రజలు విపరీతంగా స్పందించి, అధిక సంఖ్యలో అర్జీలు సమర్పించారు.
Comments
Post a Comment