చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ లో రహదారి భద్రతపై అవగాహనా కార్యక్రమం.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాలలో రహదారి భద్రతపై అవగాహనా పౌర్యక్రమమును నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తముగా ఒక ప్రకటనలో తెలియజేశారు.

రహదారి భద్రతపై అవగాహనా కార్యక్రమమును కళాశాల జాతీయ సేవా విభాగము వారి ఆధ్వర్యములో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. జగదీశ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా మహమ్మద్ మొయిన్, డి.యస్.పి. చీరాల విచ్చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ యం. వెంకటేశ్వర్లు, చీరాల సర్కిల్ ఇన్స్పెక్టర్, పి. శేషగిరిరావులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా|| కె. జగదీశ్ బాబు మాట్లాడుతూ రహదారి పై ప్రయాణించే ప్రతిఒక్కరు నియమ నిబంధనలను పాటించి తగు జాగ్రత్తలను పాటించి ప్రమాదాలను నివారించాలని అకాంక్షించారు.

వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు రహదారిపై ప్రయాణించేటప్పుడు ముందు ప్రయాణించే వాహనాన్ని చేజింగ్ చేయడం మనాలని, రహదారి డివైడర్లు అనేకమంది మరణానికి కారణమవుతున్నాయని తెలిపారు. చీరాల సర్కిల్ ఇన్స్పెక్టర్, పి శేషగిరిరావు మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలను వాహన దారులు తప్పని సరిగా పాటించాలని మరియు హెల్మెట్లను ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని పరిమాణాలు చాలా తీవ్రముగా ఉంటాయని తెలిపారు. వాహన దారులు మద్యం సేవించి వాహనముపై ప్రయాణించరాదని తెలిపారు.

ముఖ్యఅతిధిగా విచ్చేసిన మహమ్మద్ మొయిన్, డి.యస్.పి, చీరాల మాట్లాడుతూ టూవీలర్ ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, సరైన లైసెన్స్ను కలిగి ఉండాలని తెలిపారు. యాక్సిడెంట్లకారణంగా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబసభ్యుల భాధ వర్ణనాతీతం అని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాధం జరిగిన వ్యక్తికి తగిన వైద్య సహాయం అందజేయాలని తెలిపారు. రహదారి ప్రమాదాలలో రక్తం కారడం వలన అనేక మంది చనిపోవడం జరుగుతుందని తెలిపారు. యాక్సిడెంట్లో గాయపడ్డ వ్యక్తులు కోలుకోవడానికి, లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని, తద్వారా అప్పుల బారిన పడటం, మరియు కుటుంభ ఆర్ధిక స్థితి తల్ల క్రిందులవటం జరుగుతుందని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ పోన్లో సంభాషించరాదని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉద్యోగమును సాధించి తమ తల్లితండ్రులు మరియు సమాజం గర్వించే విధంగా కృషిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమములో కళాశాల విద్యార్థులు ముఖ్యఅతిధి మహమ్మద్ మొయిన్ను మరియు సి.ఐ, యస్.ఐ లను శాలువాతో సన్మాంనిచారు. ఈ కార్యక్రమమునకు జాతీయ సేవా విభాగము కో ఆర్డినేటర్ డా॥ డి. జ్యోతి స్వరూప్ కన్వీనర్ గా వ్యవహరించారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి.రమణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాస రావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

చీరాల మోహన్ థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని విద్యార్థులకు ఉచిత ప్రదర్శన