జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనసేన ఆవిర్భవించిందని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జనరంజక పాలన అందిస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ అన్నారు.
శుక్రవారం పిఠాపురం చిత్రాడ లో జరుగుతున్న జనసేన 12వ విజయోత్సవ సభకు చీరాల నుంచి భారీగా జనసైనికులు తరలి వెళ్ళారు..
ఈ సందర్భంగా గూడూరు శివరామ ప్రసాద్ మాట్లాడుతూ ఆమంచి స్వాములు ఆద్వర్యంలో చీరాల నుంచి వంద కార్లు,ఇరవై బస్సులలో జనసైనికులు తరలి వెళ్తున్నమన్నారు..
ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకే జనసేన పనిచేస్తుందని,రాష్ట్రాభివృద్ధి కి పవన్ కళ్యాణ్ ఆశయాల తో ముందుకు సాగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీర మహిళ లక్కాకుల లక్ష్మి,,అనుమ కొండ కిషోర్ కోఆర్డినేషన్లో ,జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
Comments
Post a Comment