వ్యాపార రంగాల్లో ప్రతిభ ఘన పరిచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం మహిళ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రధానం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని చీరాల మేరీ క్రిస్టియన్ పేటకు చెందిన శ్రీమతి గాలంకి మేరీ కి వెస్టేజ్ కంపెనీకి కి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి అధిక రాబడులు తెచ్చేందుకు కృషిచేసిన మేరీకి డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్ లెన్సీ అవార్డును కేంద్ర మంత్రి స్మృతీఇరాని చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే అవార్డు లు ప్రతి ఒక్కరిని వరిస్తాయని అవార్డు గ్రహీత మేరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె తోటి ఉద్యోగులు టీం మెంబెర్స్ ఆమెకు అభినందనలు తెలియజేశారు.
కారంచేడు స్మారక స్థూపం కారంచేడు మారణకాండకు నేటితో 37 ఏళ్లు. రాజకీయంగా, సామాజికంగా కులం పోషిస్తున్న పాత్రను, ముఖ్యంగా దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన ఘటన కారంచేడు. హరిత విప్లవం సాగిన ప్రాంతాల్లో దాని వల్ల బలపడిన శూద్ర అగ్రకులాలు దళితుల మీద సాగించిన దాడిగా దీనికి సామాజిక క్రమంలో ప్రాధాన్యముందని విశ్లేషకులు భావిస్తారు. తెలుగు నేల మీద జరిగిన ప్రధాన దాడులు కారంచేడు, చుండూరు.. రెంటిలోనూ పారిన నెత్తుటికి నీటి పారుదల కాల్వలు సాక్ష్యంగా ఉండడం సామాజిక పరిణామంలో కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ విషయంలో అంతగా చర్చలో ఉండని రాజకీయ నాయకుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు గత ఏడాది హఠాత్తుగా నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో మరొక్కమారు అది చర్చకు వేదికగా మారింది. ఈ నేపథ్యంలో బీబీసీ తెలుగు కారంచేడు ఘటనతో ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తులతో 2020 సంవత్సరంలో మాట్లాడింది. "తగలబెట్టేద్దామని అనుకున్నారు" "మాదిగల మీద కోపంగా ఉన్న కమ్మవారు పొద్దున్నే పల్లెమీదకు వస్తారని తెలుసు. వాళ్లొస్తే లేని పోని రచ్చ. మీరు కాలువకు పొండి అని మా అమ్మ నన్...
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు – 2025 కృష్ణా రెడ్డికి ప్రదానం చీరాల, ఏప్రిల్ 2025: నిరంతరమైన నిబద్ధత, నిజాయితీ, ప్రజల పక్షాన గళమెత్తే ధైర్యంతో తన విలేఖరి వృత్తిని నడిపిస్తూ, సమాజంలో నిజాన్ని వెలుగులోకి తీసుకురావడంలో విశేష కృషి చేసిన సాక్షి టీవీ చీరాల విలేఖరి శ్రీ కృష్ణా రెడ్డి తాజాగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు 2025ను అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం ప్రముఖ సేవా సంస్థ కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు హాజరయ్యారు. అవార్డు కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్రీమతి వి. వెంకట అశ్విని ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. * అవార్డు గ్రహీత కృషిపై ప్రశంసలు.. కృష్ణా రెడ్డి పలు సంవత్సరాలుగా తన వృత్తిపరమైన విలేఖరిత్వం ద్వారా సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుండారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా హక్కులు, విద్య, ఆరోగ్య సదుపాయాల కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్ల...
Comments
Post a Comment