సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ -2022 పరీక్షలకు ది. 25-6-2022 శని వారము నాడు 234 మంది అభ్యర్ధులు హాజరైనట్లు కళాశాల సెక్రటరి శ్రీ వనమా రామకృష్ణా రావు గారు మరియు కరస్పాండెంట్ శ్రీ శ్రీమంతుల లక్ష్మణ రావు గారు సంయుక్తముగా ఒక ప్రకటనలో తెలియజేశారు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాల 2001 స్థాపించబడినది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాల జె.యన్.టి.యు కాకినాడ యూనివర్సిటికి అనుబంధ సంస్థగా ఉంటూ నాక్ వారిచే 3 పర్యాయములు 'ఎ ' గ్రేడు గుర్తింపు, యన్.బి.ఎ వారిచే 3. పర్యాయములు గుర్తింపు, యు.జి.సి వారిచే అటానమస్ కళాశాల గా గుర్తింపు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారిచే సీమెన్స్ వారి సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎంపిక కాబడినది. ఇంజినీరింగ్ తో సహా వివిధ రంగాలలో 40,000 పైగా ఇంటర్న్షిప్లు అందిస్తూ నెం.1 శిక్షణా వేదికగా నిలచిన ఇంటర్న్ శాల ద్వారా దేశవ్యాప్తంగా 1530కి పైబడిన కళాశాలలనందు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి 518 ర్యాంకును దక్షిణాదిలో 618 కళాశాలలో 187వ ర్యాంకును సాధించినది.

ది. 25-6-2022 శనివారం నాడు కళాశాల లో నేషనల్ టెస్టింగ్ సెంటర్ వారి ఆధ్వర్యములో నివ్వహించబడుచున్న జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు -2022 కు 260మందికి గాను 234 మంది అభ్యర్ధులు. హాజరైనట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డా॥ మొయిద వేణు గోపాల రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు ఐఐఐటి, ఒంగోలు నుండి డా॥ బి. వి. రాఘవయ్య గారు మరియు యన్.ఐ.టినుండి శ్రీ యమ్. ఈశ్వర రెడ్డిగారు పరిశీలకులు గా విచ్చేశారు. డా॥ యస్.వి.డి అనిల్ కుమార్ గారు డెప్యూటి సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....