ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.
బాపట్ల జిల్లా చీరాలలో మాజీమంత్రి, ప్రజాబంధు ప్రగడ కోటయ్య నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరి కూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు,దామర్ల శ్రీకృష్ణ,చుండూరు వాసు తదితరులు.
ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరికూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,చుండూరి వాసులు మాట్లాడుతూ, ప్రజాబంధు ప్రగడ కోటయ్యను రగడ కోటయ్యగా కూడా పిలుస్తుంటారు.ప్రజా సమస్యల పట్ల బాగా స్పందిస్తారు.రెండు సార్లు ఎం ఎల్ ఏ గా,ఒకసారి ఎం ఎల్ సి గా ఎన్నికైనారు.చేనేత రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన గొప్పవ్యక్తి ఆయన.అంతేకాదు ఎత్తిపోతల పథకానికి సైతం ఆయన శ్రీకారం చుట్టారు ఆయన నూట ఎనిమిదవ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రగడ కోటయ్య కుమారులు రిటైర్డ్ ఇంజినీర్ ప్రగడ వెంకట శేష సాయి నాధ్ దంపతులు,పలువురు కౌన్సిల్లెర్లు,అభిమానులు పాల్గొన్నారు.
Comments
Post a Comment