27న చేపట్టే అగ్రిగోల్డ్ సదస్సును జయప్రదం చేయాలి- CPI నాయకులు.

కోసిగి మండల: ఈ నెల 27న చేపట్టే అగ్రిగోల్డ్
సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎమ్. గోపాల్ సిపిఐ మండల కార్యదర్శి తాయన్న మాట్లాడుతూ ఈ నెల 27న బుధవారం ఉదయం 10 గంటలకు సి.అర్. భవన్ సి.పి.ఐ ఆఫీసు నందు, వినాయక ఘాట్ దగ్గర, కొత్త అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంనకు రాష్ట్ర సమితి నాయకులు కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వర రావు హాజరవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన చెల్లింపుల విషయంలో వస్తున్న సమస్యలపై 20 వేల పైన రావలిసిన డిపాజిట్ల గురించి, బౌన్స్ అయిన చెక్స్ గురించి, చనిపోయిన బాధితులు ఎక్స్ గ్రేసియా విషయం పై, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్ గురించి మరియు కోర్టులో కేసు వేగవంతం పై జరగవలిసిన చర్యలు గురించి తదితర విషయాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ తప్పక రావలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శిఉలిగయ్య, దిద్ది సిద్దప్ప, ఈరన్న, నాగరాజు, వీరేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....