ఐక్యనగర్ లో ఉన్న కారంచేడు మృతవీరుల రుధిరక్షేత్రం వద్ద ఘన నివాళి

బాపట్ల జిల్లా చీరాల ముప్పై మూడవ వార్డు ఐక్యనగర్ లో ఉన్న కారంచేడు మృతవీరుల రుధిరక్షేత్రం వద్ద దుడ్డు భాస్కరరావు,లక్ష్మీనరసయ్య,గొర్రెపాటి రవి,బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి,పట్టణాధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి,భగత్ సింగ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దుడ్డు భాస్కరరావు మాట్లాడుతూ, కారంచేడు సంఘటన జరిగి నేటికి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది.ఆ సంఘాటనలో ఏడుగురు అసువులు బాసారు.ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు.జిల్లా కోర్టు నుండి హైకోర్టు లో కూడా మాకు అన్యాయం జరిగింది.తదుపరి సుప్రీంకోర్టులో ఇరవై సంవత్సరాలు పోరాడితే  మాకు న్యాయం జరిగింది.ఈపోరాటంలో మాకు అనేకమంది నాయకులు అండగా నిలిచారు.వారి దయవల్ల ఆ దారుణ మారణ కాండలో పాల్గొన్న వారికి శిక్షలు పడ్డాయి అని తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....