అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలి -- బీరక సురేంద్ర చైర్మన్ దేవాంగ కార్పోరేషన్.

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలి -- బీరక సురేంద్ర చైర్మన్ దేవాంగ కార్పోరేషన్
వేటపాలెం మండలంలోని అక్కాయిపాలెం పంచాయితీ పరిధిలోని మాచర్ల మోహన్ రావు కాలనీ మరియు గురవయ్య కాలనీ లో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పర్యటించి చేనేతలతో మాట్లాడటం జరిగింది.నేతన్న నేస్తం నమోదు ప్రక్రియ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంటనే సచివాలయ సిబ్బంది తో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్క నేతన్నకు నేతన్న హస్తం అందేలా చూడాలని సూచించారు.సురేంద్ర మాట్లాడుతూ  అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటం ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష్యం కనుక వారి లక్ష్య సాధన కోసం ప్రభుత్వసంక్షేమ పధకాలన్నీ సక్రమంగా అందరికీ అందేలా చూడటమే మా భాద్యత.  అర్హులై ఉండి, ఎవరికైనా పొరపాటున నేతన్న హస్తం కానీ సంక్షేమ పథకాలు రాని పక్షంలో మాదృష్టికి తీసుకొచ్చిన యెడల సంబంధిత అధికారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు మంజూరు చేసేలా తమవంతు కృషిచేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్ర వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ధరణి కుమార్, ప్రసాదరావు,సురేష్, నాగరాజు,యశ్వంత ,సాయి కుమార్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....