చేనేతల_రౌండ్_టేబుల్_సమావేశం
చీరాల గోలి సదాశివరావు కల్యాణ మండపంలో చేనేతల రౌండ్ టేబుల్ సమావేశం దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర అధ్యక్షతన చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ ప్రారంభ ఉపన్యాసం తో సమావేశం ప్రారంభించి నాయకులు ప్రస్తుత పరిస్థితులు మరియు చేనేత పురోభివృద్ధి కి కావలసిన సూచనలు ఇవ్వాలని కోరారు. మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా ఉత్పత్తికి అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేయాలని కోరారు. దామర్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేత చీరలను పవర్ లూము పై తయారు చేయకుండా చేనేత రిజర్వేషన్ యాక్ట్ ని అమలు చేయాలని కోరారు. కర్ణ లక్షరావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం చేనేతలకు ఎంతో ఉపయోగపడుతుందని అలాగే సొసైటీలో నిల్వ ఉన్న వస్త్రాలు కొనుగోలు చేసి సొసైటీ లను బలోపేతం చేయాలని కోరారు. పింజల ప్రసాదరావు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం చేనేతలు ఉన్న నియోజకవర్గంలో చేనేతలకు ప్రజా ప్రతినిధులు గా ఉంటే మన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అందుకే మనం కలసి కట్టుగా ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. గంజి ప్రసాదరావు మాట్లాడుతూ నూలు పై వేసిన జి ఎస్ టి తగ్గించే వరకు చేనేత వర్గం ఉమ్మడి కార్యాచరణ తో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ చేనేత పార్క్ కోసం ఉన్న స్థలాన్ని ఉపయోగించి చేనేత రంగ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు, చేనేత నాయకులు మాట్లాడిన తరువాత అధ్యక్షలు బీరక సురేంద్ర మాట్లాడుతూ నాయకులు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దేవాంగ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మరియు ప్రభుత్వానికి ,ప్రజలకు మధ్య వారధి గా భాద్యతలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దామర్ల శివయ్య, గుద్దంటి సుధాకర్, బట్ట వెంకటేశ్వరరావు, పేరిశేట్ల పూర్ణ, అండగుండా నారాయణ, బండ్ల బాబు, బీరక పరమేశ్వరరావు,ఆలూరి శ్రీనివాసరావు,ఉడుత ప్రసాదరావు,మాచర్ల గౌరి ,కందుల విజయ్ కుమార్ ,గుంటి శ్రీనివాసరావు, అల్లాడ మంగ ప్రసాద్, కర్ణిపాటి కృష్ణయ్య, అమిత్ కుమార్, ధనంజయరావు ,సురేష్, మాస్టర్ వివర్స్, నాయకులు మరియు చేనేతలు పాల్గొన్నారు.
Comments
Post a Comment