చైర్మన్ జంజనం చేతుల మీదుగా వాలేంటర్ కు నియామక పత్రం అందుచేత.....విధులు సక్రమంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి.......
బాపట్ల జిల్లా, చీరాల...
నిత్యం వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందే విధంగా చూస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు లకు మంచి పేరు తీసికొనివచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.చీరాల పట్టణ పరిధిలోని పేరాల శృంగార పేటకు చెందిన పేర్లి నవీన్ 21 వార్డులో వాలేంటర్ గానియమితులయ్యారు,నవీన్ కు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వర రావు మరియు వైసీపీ నాయకులు
పేర్లి నాని చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందచేశారు.ఈ సందర్భంగా జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందే విధంగా కృషి చేయాలని, మంచి పేరు తెచ్చుకొని ఉత్తమ వాలేంటర్ గా అవార్డు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్
నాగమల్లేశ్వర రావు,వైసీపీ నాయకులు పేర్లి నాని,ప్రకాష్, నూతన వాలేంటర్ గా నియమితులైన నవీన్ పాల్గొన్నారు.
Comments
Post a Comment