Posts

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

Image
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు – 2025 కృష్ణా రెడ్డికి ప్రదానం చీరాల, ఏప్రిల్ 2025: నిరంతరమైన నిబద్ధత, నిజాయితీ, ప్రజల పక్షాన గళమెత్తే ధైర్యంతో తన విలేఖరి వృత్తిని నడిపిస్తూ, సమాజంలో నిజాన్ని వెలుగులోకి తీసుకురావడంలో విశేష కృషి చేసిన సాక్షి టీవీ చీరాల విలేఖరి శ్రీ కృష్ణా రెడ్డి తాజాగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు  2025ను అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం ప్రముఖ సేవా సంస్థ కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు హాజరయ్యారు.  అవార్డు కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్రీమతి వి. వెంకట అశ్విని ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. * అవార్డు గ్రహీత కృషిపై ప్రశంసలు.. కృష్ణా రెడ్డి పలు సంవత్సరాలుగా తన వృత్తిపరమైన విలేఖరిత్వం ద్వారా సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుండారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా హక్కులు, విద్య, ఆరోగ్య సదుపాయాల కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్ల...

వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలు

Image
మహాత్మ జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాలతో నాయకులు ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సాధు రాఘవ,కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొన్నారు.

చీరాల నుండి అమరావతికి బస్సు కావాలని వినతి

Image
చీరాల నుండి అమరావతి సచివాలయానికి,హైకోర్టుకు వెళ్లడానికి వీలుగా బస్సు సౌకర్యం కల్పించాలని  నేతాజీ సేవా సమితి ప్రతినిధులు సోమవారం చీరాల ఆర్టీసీ డి.ఎం శ్యామలకు వినతి పత్రం సమర్పించారు.ప్రస్తుతం చీరాల నుండి సచివాలయానికి లేదా హైకోర్టుకు వెళ్లాలంటే మంగళగిరి లేదా గుంటూరు వెళ్లాల్సి వస్తుందన్నారు.చీరాల ప్రజలకు ఇది అసౌకర్యంగా ఉన్నందున నేరుగా బస్సు ఏర్పాటు చేయాలని కోరగా ఆర్టీసీ డిఎం సానుకూలంగా స్పందించారు

చీరాల మోహన్ థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని విద్యార్థులకు ఉచిత ప్రదర్శన

Image
విద్యార్థి విద్యార్థులకు చీరాల మోహన్  థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించిన కూరపాటి శ్రీనివాసరావు

మేదరమెట్లకు చేరుకున్న వైయస్‌ జగన్‌...వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్ధివ దేహానికి నివాళులు

Image
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్‌ జగన్‌ బాపట్ల జిల్లా మేదరమెట్లలోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు

Image
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనసేన ఆవిర్భవించిందని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జనరంజక పాలన అందిస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ అన్నారు. శుక్రవారం పిఠాపురం చిత్రాడ లో జరుగుతున్న జనసేన 12వ విజయోత్సవ సభకు చీరాల నుంచి భారీగా జనసైనికులు తరలి వెళ్ళారు.. ఈ సందర్భంగా గూడూరు శివరామ ప్రసాద్ మాట్లాడుతూ ఆమంచి స్వాములు ఆద్వర్యంలో చీరాల నుంచి వంద కార్లు,ఇరవై బస్సులలో జనసైనికులు తరలి వెళ్తున్నమన్నారు.. ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకే జనసేన పనిచేస్తుందని,రాష్ట్రాభివృద్ధి కి పవన్ కళ్యాణ్ ఆశయాల తో ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ లక్కాకుల లక్ష్మి,,అనుమ కొండ కిషోర్ కోఆర్డినేషన్లో ,జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు

Image
వ్యాపార రంగాల్లో ప్రతిభ ఘన పరిచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం మహిళ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రధానం చేసింది. అందులో భాగంగా  ఆంధ్రప్రదేశ్ లోని చీరాల మేరీ క్రిస్టియన్ పేటకు  చెందిన శ్రీమతి గాలంకి మేరీ కి వెస్టేజ్ కంపెనీకి కి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి అధిక రాబడులు తెచ్చేందుకు కృషిచేసిన మేరీకి డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్ లెన్సీ అవార్డును కేంద్ర మంత్రి స్మృతీఇరాని చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే అవార్డు లు ప్రతి ఒక్కరిని వరిస్తాయని అవార్డు గ్రహీత మేరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె తోటి ఉద్యోగులు టీం మెంబెర్స్ ఆమెకు అభినందనలు తెలియజేశారు.