Posts

అట్టహాసంగా జరిగిన బాపట్ల జిల్లా తొలి AITUC మహా సభ.

Image
చీరాల పట్టణంలో కార్మికుల భారీ ర్యాలీ. ఈ కార్యక్రమానికి బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా గౌరవ అధ్యక్షులుగా మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో కామాక్షి హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు, డాక్టర్ జీవి పున్నారావు, మారుబోయిన పాపారావు,సీపీఐ బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి,తన్నీరు సింగరకొండ,సీపీఐ జిల్లా సమితి సభ్యులు మేడ వెంకట్రావు, ఏఐటీయూసీ బాపట్ల జిల్లా కన్వీనర్ బత్తుల శామ్యూల్, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు పి నాగంజానేయులు, కోటి దాసు,ధనలక్ష్మి, జెల్లీ భాగ్య శ్రీధర్,అచ్యుతుని బాబురావు, ప్రసాద్, అంజిరెడ్డి, కరిముల్లా, పడమట భిక్షాలు, బాసి పైడయ్య,తదితరులు పాల్గొన్నారు.

విషాదం: బాసర ఐఐఐటీ విద్యార్థి మృతి, కలుషిత ఆహారమే కారణం!

Image
హైదరాబాద్: బాసర ఐఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థి మృతి చెందాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్ రంగెంపేటకు చెందిన సంజయ్ కిరణ్ (22) బాసర ఐఐఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విషతూల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు సంజయ్​. దీంతో కొంతకాలంగా హనుమకొండ రోహిణి, హైదరాబాద్‌​లోని యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. వైద్యానికి దాదాపు 16 లక్షలు ఖర్చుచేసినా లాభం లేకపోయింది. ఐఐటీలో ఆహారం విషతుల్యం కావటం వల్లే.. తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని సంజయ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా తన కుమారున్ని కాపాడుకోలేకపోయామని సంజయ్ తండ్రి శ్రీధర్ గుండెలవిసేలా రోధించాడు. అయితే బాసర ట్రిపుల్​ఐటీలో చేరక ముందే సంజయ్ అనారోగ్యం బారిన పడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో సంజయ్ కిరణ్ మృతిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో జులై 15న మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ కలుషిత...

చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య108 జయంతి వేడుకలు.

Image
బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ముద్రబోయిన మాలకొండయ్య ఆధ్వర్యంలో మాజీమంత్రి,ప్రజాబంధు ప్రగడ కోటయ్య నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,1952 వ సంవత్సరం లో జన్మించిన ప్రగడ కోటయ్య నాటి నేటి నేతలకు ఆదర్శప్రాయులు.చేనేతల అభివృద్ధికి విశేష కృషిచేసిన మహోన్నత వ్యక్తి.అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌతరపు జనార్దన్,శ్రీనివాస తేజ,పూర్ణ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

Image
బాపట్ల జిల్లా చీరాలలో మాజీమంత్రి, ప్రజాబంధు ప్రగడ కోటయ్య నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరి కూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు,దామర్ల శ్రీకృష్ణ,చుండూరు వాసు తదితరులు. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరికూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,చుండూరి వాసులు మాట్లాడుతూ, ప్రజాబంధు ప్రగడ కోటయ్యను రగడ కోటయ్యగా కూడా పిలుస్తుంటారు.ప్రజా సమస్యల పట్ల బాగా స్పందిస్తారు.రెండు సార్లు ఎం ఎల్ ఏ గా,ఒకసారి ఎం ఎల్ సి గా ఎన్నికైనారు.చేనేత రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన గొప్పవ్యక్తి ఆయన.అంతేకాదు ఎత్తిపోతల పథకానికి సైతం ఆయన శ్రీకారం చుట్టారు ఆయన నూట ఎనిమిదవ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగడ కోటయ్య కుమారులు రిటైర్డ్ ఇంజినీర్ ప్రగడ వెంకట శేష సాయి నాధ్ దంపతులు,పలువురు కౌన్సిల్లెర్లు,అ...

పాఠశాలలో బాలిక కాలును చుట్టేసిన పాము.. ఆ తర్వాత ఏమైందంటే!!

Image
పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో భయానక ఘటన జరిగింది. ఓ నాలుగో తరగతి విద్యార్థిని కాలును పాము చుట్టేసింది. ఆ బాలిక గట్టిగా అరుస్తూ..కాలును విదిలించడంతో పాము విడిచిపెట్టింది. అనంతరం అల్మరాలో దూరింది. ఈ ఘటన పాలక్కాడ్‌లోని ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో జరిగింది. బాలిక కేకలు విన్న ఉపాధ్యాయులు పరుగున తరగతి గదికి చేరుకున్నారు. ఆ పామును గుర్తించి, చంపేశారు. షాక్‌కు గురైన బాలికను జిల్లా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆ బాలికను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె కాలిపై పాముకాటు గుర్తులు లేవని, 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. భారీ వర్షం కారణంగా పాఠశాల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరిగాయని, విషపురుగులు తరగతి గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.

27న చేపట్టే అగ్రిగోల్డ్ సదస్సును జయప్రదం చేయాలి- CPI నాయకులు.

Image
కోసిగి మండల: ఈ నెల 27న చేపట్టే అగ్రిగోల్డ్ సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఎమ్. గోపాల్ సిపిఐ మండల కార్యదర్శి తాయన్న మాట్లాడుతూ ఈ నెల 27న బుధవారం ఉదయం 10 గంటలకు సి.అర్. భవన్ సి.పి.ఐ ఆఫీసు నందు, వినాయక ఘాట్ దగ్గర, కొత్త అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంనకు రాష్ట్ర సమితి నాయకులు కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వర రావు హాజరవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన చెల్లింపుల విషయంలో వస్తున్న సమస్యలపై 20 వేల పైన రావలిసిన డిపాజిట్ల గురించి, బౌన్స్ అయిన చెక్స్ గురించి, చనిపోయిన బాధితులు ఎక్స్ గ్రేసియా విషయం పై, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్ గురించి మరియు కోర్టులో కేసు వేగవంతం పై జరగవలిసిన చర్యలు గురించి తదితర విషయాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ తప్పక రావలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శిఉలిగయ్య, దిద్ది సిద్దప్ప, ఈరన్న, నాగరాజు, వీరేష్,...

కాంగ్రెస్‌కు ‘మునుగోడు’ టెన్షన్.. మళ్లీ అలా జరిగితే.. కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమా ?

Image
తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఆ ఎన్నికలతో నష్టపోతోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అనేక మంది విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, నాగార్జునసాగర్,(Nagarjuna Sagar) హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. నాగార్జునసాగర్‌లో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచినా.. అదంతా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ వల్లే అనే వాదన ఉంది. ఈ ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని.. ఆ స్థానంలో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ బలపడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇదిలా ఉంటే త్వరలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు(Munugodu) స్థానానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వస్తుందనే వాదన వినిపిస్తోంది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై టీఆర్ఎస్, బీజేపీ ఇప్పట...