Posts

Showing posts from March, 2025

చీరాల మోహన్ థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని విద్యార్థులకు ఉచిత ప్రదర్శన

Image
విద్యార్థి విద్యార్థులకు చీరాల మోహన్  థియేటర్ లో "ఛావా" చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించిన కూరపాటి శ్రీనివాసరావు

మేదరమెట్లకు చేరుకున్న వైయస్‌ జగన్‌...వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్ధివ దేహానికి నివాళులు

Image
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్‌ జగన్‌ బాపట్ల జిల్లా మేదరమెట్లలోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి పిచ్చమ్మ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

జనసేన ఆవిర్భావ సభకు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో భారీ ఎత్తున చీరాల నుంచి తరలి వెళ్లిన జనసైనికులు వీర మహిళలు

Image
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనసేన ఆవిర్భవించిందని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జనరంజక పాలన అందిస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ అన్నారు. శుక్రవారం పిఠాపురం చిత్రాడ లో జరుగుతున్న జనసేన 12వ విజయోత్సవ సభకు చీరాల నుంచి భారీగా జనసైనికులు తరలి వెళ్ళారు.. ఈ సందర్భంగా గూడూరు శివరామ ప్రసాద్ మాట్లాడుతూ ఆమంచి స్వాములు ఆద్వర్యంలో చీరాల నుంచి వంద కార్లు,ఇరవై బస్సులలో జనసైనికులు తరలి వెళ్తున్నమన్నారు.. ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకే జనసేన పనిచేస్తుందని,రాష్ట్రాభివృద్ధి కి పవన్ కళ్యాణ్ ఆశయాల తో ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ లక్కాకుల లక్ష్మి,,అనుమ కొండ కిషోర్ కోఆర్డినేషన్లో ,జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు

Image
వ్యాపార రంగాల్లో ప్రతిభ ఘన పరిచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం మహిళ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రధానం చేసింది. అందులో భాగంగా  ఆంధ్రప్రదేశ్ లోని చీరాల మేరీ క్రిస్టియన్ పేటకు  చెందిన శ్రీమతి గాలంకి మేరీ కి వెస్టేజ్ కంపెనీకి కి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి అధిక రాబడులు తెచ్చేందుకు కృషిచేసిన మేరీకి డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్ లెన్సీ అవార్డును కేంద్ర మంత్రి స్మృతీఇరాని చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే అవార్డు లు ప్రతి ఒక్కరిని వరిస్తాయని అవార్డు గ్రహీత మేరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె తోటి ఉద్యోగులు టీం మెంబెర్స్ ఆమెకు అభినందనలు తెలియజేశారు.

దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం

Image
* జిల్లా అధ్యక్షులుగా చీరాల కు చెందిన గుమ్మడి సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శిగా గుడిమొటి అశోక్ కుమార్ ఎంపిక. * న్యాయ పరమైన దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి.. చీరాల :దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలని ఎస్సీ,ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రమేష్ అన్నారు. బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్  నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వేంకట మురళీని మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పత్రిక రంగంలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ ల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చెయ్యాలని,వృత్తిపరంగా దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కరించాలని  అన్నారు. ఎస్సి ఎస్టీ జర్నలిస్టులను ఐక్య పరచి అసోసియేషన్ బలోపేతానికి కృషి చెయ్యాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జే వేంకట మురళీ చేతుల మీదుగా ఎస్సి ఎస్టీ జర్నలిస్టుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. * ఎంపికైన జర్నలిస్టులు.. బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చీరాల విశ...