దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం

* జిల్లా అధ్యక్షులుగా చీరాల కు చెందిన గుమ్మడి సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శిగా గుడిమొటి అశోక్ కుమార్ ఎంపిక.
* న్యాయ పరమైన దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి..

చీరాల :దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలని ఎస్సీ,ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రమేష్ అన్నారు.
బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ 
నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వేంకట మురళీని మర్యాద పూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పత్రిక రంగంలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ ల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చెయ్యాలని,వృత్తిపరంగా దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కరించాలని  అన్నారు.
ఎస్సి ఎస్టీ జర్నలిస్టులను ఐక్య పరచి అసోసియేషన్ బలోపేతానికి కృషి చెయ్యాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జే వేంకట మురళీ చేతుల మీదుగా ఎస్సి ఎస్టీ జర్నలిస్టుల క్యాలెండర్ను ఆవిష్కరించారు.
* ఎంపికైన జర్నలిస్టులు..
బాపట్ల జిల్లా ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చీరాల విశాలాంధ్ర ఇన్చార్జి గుమ్మడి సూర్యప్రకాష్ ఎంపికవ్వగా ,ప్రధాన కార్యదర్శిగా రేపల్లెకు చెందిన గూడూరు రమేష్ బాబు, గౌరవ అధ్యక్షులుగా బొడ్డు మణి వరకుమార్ ఉపాధ్యక్షులుగా కర్ర జయరాం, సహాయ కార్యదర్శిగా వేటపాలెం విశాలాంధ్ర మండల రిపోర్టర్ గుడిమొటి అశోక్ కుమార్ లు ఎంపికయ్యారు.
నూతన కమిటీని జిల్లా కలెక్టర్ వేంకట మురళీ అభినందించారు ...

Comments

Popular posts from this blog

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

ముగిసిన మజ్జిగ చలివేంద్రం

చీరాల మహిళలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు