తల్లి పాలు బిడ్డల ఎదుగుదల కు ఆరోగ్యానికి శ్రేష్ఠమైనవి.

చీరాల:తల్లి పాలు బిడ్డల ఆరోగ్యానికి, ఎదుగుదలకు శ్రేష్ఠమైనవని, తల్లి పాలలో బిడ్డల ఎదుగుదలకు అవసరమైన
పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయని మునిసిపల్ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు అన్నారు.
ప్రపంచ తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా  పదవ వార్డు కౌన్సిలర్ గోలి స్వాతి ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారనికి సంబంధించిన ప్రోటీన్ కిట్లు అందజేశారు.
 ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోలి స్వాతి మాట్లాడుతూ తల్లిపాల వలన  బిడ్డలకు పుష్కలమైనపౌష్టికవిలువలుఅందుతాయని,తల్లిపాలుబిడ్డలకుశ్రేష్ఠమైనవని,బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసికోవాలని అన్నారు.
సీడీపీఓ ఝాన్సీమాట్లాడుతూ    బాలింతలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని,క్రమం తప్పకుండా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ,ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలను సంప్రదిస్తూ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని,తల్లి పాలు చిన్నారులకు అమృతమని,బిడ్డకు 24 గం లోపు ముర్రుపాలు ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా శ్వాసకోస వ్యాధులు,జీర్ణ సంబంధిత వ్యాధులు దరిచేరవని,చిన్న బిడ్డలకు ఆరు నెలల వరకు తల్లి పాలు ఇస్తే జ్ఞాపక శక్తి పెరిగి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎమ్ లు,గర్భిణీ స్త్రీలు,బాలింతలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....