Posts

Showing posts from June, 2022

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు.

Image
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలకు 234 మంది అభ్యర్థులు హాజరు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాలలో జె.ఇ.ఇ మెయిన్స్ -2022 పరీక్షలకు ది. 25-6-2022 శని వారము నాడు 234 మంది అభ్యర్ధులు హాజరైనట్లు కళాశాల సెక్రటరి శ్రీ వనమా రామకృష్ణా రావు గారు మరియు కరస్పాండెంట్ శ్రీ శ్రీమంతుల లక్ష్మణ రావు గారు సంయుక్తముగా ఒక ప్రకటనలో తెలియజేశారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాల 2001 స్థాపించబడినది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాల జె.యన్.టి.యు కాకినాడ యూనివర్సిటికి అనుబంధ సంస్థగా ఉంటూ నాక్ వారిచే 3 పర్యాయములు 'ఎ ' గ్రేడు గుర్తింపు, యన్.బి.ఎ వారిచే 3. పర్యాయములు గుర్తింపు, యు.జి.సి వారిచే అటానమస్ కళాశాల గా గుర్తింపు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారిచే సీమెన్స్ వారి సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎంపిక కాబడినది. ఇంజినీరింగ్ తో సహా వివిధ రంగాలలో 40,000 పైగా ఇంటర్న్షిప్లు అందిస్తూ నెం.1 శిక్షణా వేదికగా నిలచిన ఇ

చీరాల మండలం సాయికాలని లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్సీ పోతుల సునీత

Image
బాపట్ల జిల్లా చీరాల మండలం సాయి కాలనిలో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమాన్ని  MLC పోతుల సునీత చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాయి కాలనిలో పర్యటించడం జరిగింది.ప్రతి ఇంటికి వెళ్లి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నాము అన్నారు. అందరికి అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాము అని తెలిపారు. స్వచ్ఛందంగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతామని ముందుకు రాగా  వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ  నాయకులు పోతుల సురేష్, గోలి ఆనందరావు, మల్లెల బుల్లిబాబు, వాలంటీర్లు పాల్గొన్నారు. 

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం

Image
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో గతరాత్రి బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ముద్రబోయిన మాలకొండయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిసారిగా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.సంక్షేమ పథకాలు నుండి ప్రతి పధకం ఎంతమందికి అందుతున్నాయి అని తెలుసుకుంటున్నాము.కరెంట్ నుండి ప్రతి ఒక్క దానిపై బాదుడే బాదుడు.వీటిఅన్నిటిపై అధిష్టానం సూచించిన విధంగా ముందుకు పోతున్నాం అని తెలిపారు.  

బాపట్ల జిల్లా చీరాల బాయ్స్ హైస్కూలులో హయ్యర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Image
  బాపట్ల జిల్లా చీరాల బాయ్స్ హైస్కూలులో హయ్యర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెడ్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు బోనిగల ప్రేమయ్య, జైసన్ బాబు.ఈ సందర్భంగా చీరాల మునిసిపల్ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు మాట్లాడుతూ, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పది రోజులు నిర్వహించడం అంటే చాలా కష్టం అయిన విషయం.జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు వచ్చారు. కుల,మతాలు,రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి.ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించుకోడానికి చైర్మన్,కమీషనర్ల నుండి అనుమతులు తీసుకురావడం జరిగింది.చక్కటి వాతావరణంలో క్రికెట్ పోటీలు జరగడానికి అందరం సహకరిద్దాం అని తెలిపారు.