Posts

జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని.....

Image
జిల్లా కలెక్టర్ కు మాతృమూర్తి మధర్ థెరిసా జ్ఞాపికను బహుకరించిన పేర్లి నాని..... చిద్విలాసంగా జ్ఞాపికను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ....... చీరాల, బాపట్ల జిల్లా... సేవా తత్వానికి నిదర్శనం మధర్ థెరిసా అని, ఎదుటివారి ఎడల ప్రేమ,జాలి,దయ,కరుణ కలిగినప్రేమస్వరూపిణి,పేదలను అక్కున చేర్చుకొని అమ్మలా లాలించిన సేవా సాద్విని మధర్ థెరిసా 112 వ జయంతి ని పురస్కరించుకుని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా సంయుక్త కార్యదర్శి పేర్లి నాని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కు బాపట్ల కలక్టరేట్ లో మధర్ థెరిసా జ్ఞాపికను అందచేశారు. ఈ జ్ఞాపికలో ప్రత్యేకత ఏమిటంటే జిల్లా కలెక్టర్ ఫోటో,జిల్లా కలెక్టర్ సంక్షేమ హాస్టల్ విద్యార్థినిలతో కూర్చుని చిరునవ్వుతో ముచ్చటిస్తూ వారితో కలిసి సహపంక్తి భోజనం అరగించిన చిత్రాన్ని కూడా ఈ జ్ఞాపికలో పొందుపరచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పేర్లి నాని అందచేసిన చిత్రపటాన్ని చూసి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మధర్ థెరిసాను ఆదర్శంగా తీసుకుని పేదల ఎడల ప్రేమ,జాలి,దయ,కరుణ కలిగి ఉండాలని,ఎదుటివారి ఎడల గ

తల్లి పాలు బిడ్డల ఎదుగుదల కు ఆరోగ్యానికి శ్రేష్ఠమైనవి.

Image
చీరాల:తల్లి పాలు బిడ్డల ఆరోగ్యానికి, ఎదుగుదలకు శ్రేష్ఠమైనవని, తల్లి పాలలో బిడ్డల ఎదుగుదలకు అవసరమైన పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయని మునిసిపల్ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు అన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా  పదవ వార్డు కౌన్సిలర్ గోలి స్వాతి ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారనికి సంబంధించిన ప్రోటీన్ కిట్లు అందజేశారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోలి స్వాతి మాట్లాడుతూ తల్లిపాల వలన  బిడ్డలకు పుష్కలమైనపౌష్టికవిలువలుఅందుతాయని,తల్లిపాలుబిడ్డలకుశ్రేష్ఠమైనవని,బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసికోవాలని అన్నారు. సీడీపీఓ ఝాన్సీమాట్లాడుతూ    బాలింతలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని,క్రమం తప్పకుండా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ,ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలను సంప్రదిస్తూ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని,తల్లి పాలు చిన్నారులకు అమృతమని,బిడ్డకు 24 గం లోపు ముర్రుపాలు ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా శ్వాసకోస వ్యాధులు,జీర్ణ సంబంధిత వ్యాధులు దరిచేరవని,చిన్న బిడ్డలకు ఆరు నెలల వరకు తల్లి పాలు ఇస్తే జ్ఞాపక శక్తి పెరిగి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా క్షేమ

అట్టహాసంగా జరిగిన బాపట్ల జిల్లా తొలి AITUC మహా సభ.

Image
చీరాల పట్టణంలో కార్మికుల భారీ ర్యాలీ. ఈ కార్యక్రమానికి బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా గౌరవ అధ్యక్షులుగా మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో కామాక్షి హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు, డాక్టర్ జీవి పున్నారావు, మారుబోయిన పాపారావు,సీపీఐ బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి,తన్నీరు సింగరకొండ,సీపీఐ జిల్లా సమితి సభ్యులు మేడ వెంకట్రావు, ఏఐటీయూసీ బాపట్ల జిల్లా కన్వీనర్ బత్తుల శామ్యూల్, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు పి నాగంజానేయులు, కోటి దాసు,ధనలక్ష్మి, జెల్లీ భాగ్య శ్రీధర్,అచ్యుతుని బాబురావు, ప్రసాద్, అంజిరెడ్డి, కరిముల్లా, పడమట భిక్షాలు, బాసి పైడయ్య,తదితరులు పాల్గొన్నారు.

విషాదం: బాసర ఐఐఐటీ విద్యార్థి మృతి, కలుషిత ఆహారమే కారణం!

Image
హైదరాబాద్: బాసర ఐఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థి మృతి చెందాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్ రంగెంపేటకు చెందిన సంజయ్ కిరణ్ (22) బాసర ఐఐఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విషతూల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు సంజయ్​. దీంతో కొంతకాలంగా హనుమకొండ రోహిణి, హైదరాబాద్‌​లోని యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. వైద్యానికి దాదాపు 16 లక్షలు ఖర్చుచేసినా లాభం లేకపోయింది. ఐఐటీలో ఆహారం విషతుల్యం కావటం వల్లే.. తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని సంజయ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా తన కుమారున్ని కాపాడుకోలేకపోయామని సంజయ్ తండ్రి శ్రీధర్ గుండెలవిసేలా రోధించాడు. అయితే బాసర ట్రిపుల్​ఐటీలో చేరక ముందే సంజయ్ అనారోగ్యం బారిన పడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో సంజయ్ కిరణ్ మృతిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో జులై 15న మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ కలుషిత

చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య108 జయంతి వేడుకలు.

Image
బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ముద్రబోయిన మాలకొండయ్య ఆధ్వర్యంలో మాజీమంత్రి,ప్రజాబంధు ప్రగడ కోటయ్య నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,1952 వ సంవత్సరం లో జన్మించిన ప్రగడ కోటయ్య నాటి నేటి నేతలకు ఆదర్శప్రాయులు.చేనేతల అభివృద్ధికి విశేష కృషిచేసిన మహోన్నత వ్యక్తి.అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌతరపు జనార్దన్,శ్రీనివాస తేజ,పూర్ణ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రగడ కోటయ్య 108 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల YSRCP నాయకులు.

Image
బాపట్ల జిల్లా చీరాలలో మాజీమంత్రి, ప్రజాబంధు ప్రగడ కోటయ్య నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరి కూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు,దామర్ల శ్రీకృష్ణ,చుండూరు వాసు తదితరులు. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైద్యులు వరికూటి అమృత పాణి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,చుండూరి వాసులు మాట్లాడుతూ, ప్రజాబంధు ప్రగడ కోటయ్యను రగడ కోటయ్యగా కూడా పిలుస్తుంటారు.ప్రజా సమస్యల పట్ల బాగా స్పందిస్తారు.రెండు సార్లు ఎం ఎల్ ఏ గా,ఒకసారి ఎం ఎల్ సి గా ఎన్నికైనారు.చేనేత రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన గొప్పవ్యక్తి ఆయన.అంతేకాదు ఎత్తిపోతల పథకానికి సైతం ఆయన శ్రీకారం చుట్టారు ఆయన నూట ఎనిమిదవ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగడ కోటయ్య కుమారులు రిటైర్డ్ ఇంజినీర్ ప్రగడ వెంకట శేష సాయి నాధ్ దంపతులు,పలువురు కౌన్సిల్లెర్లు,అ

పాఠశాలలో బాలిక కాలును చుట్టేసిన పాము.. ఆ తర్వాత ఏమైందంటే!!

Image
పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో భయానక ఘటన జరిగింది. ఓ నాలుగో తరగతి విద్యార్థిని కాలును పాము చుట్టేసింది. ఆ బాలిక గట్టిగా అరుస్తూ..కాలును విదిలించడంతో పాము విడిచిపెట్టింది. అనంతరం అల్మరాలో దూరింది. ఈ ఘటన పాలక్కాడ్‌లోని ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో జరిగింది. బాలిక కేకలు విన్న ఉపాధ్యాయులు పరుగున తరగతి గదికి చేరుకున్నారు. ఆ పామును గుర్తించి, చంపేశారు. షాక్‌కు గురైన బాలికను జిల్లా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆ బాలికను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె కాలిపై పాముకాటు గుర్తులు లేవని, 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. భారీ వర్షం కారణంగా పాఠశాల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరిగాయని, విషపురుగులు తరగతి గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.